![]() |
![]() |

బిబి జోడి సీజన్ 2 లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఇందులో జడ్జెస్ మంచి కలర్ ఫుల్ కాస్ట్యూమ్స్ తో ఎంట్రీ ఇచ్చారు. "బిబి జోడి సీజన్ 2 లో అసలైన ఆట ఈ వారం నుంచి మొదలు కాబోతోంది. ఇక్కడున్న జోడీస్ లో ఫైర్ ఉంది ఇంకొంతమంది జోడీస్ దగ్గర పవర్ అస్త్ర ఉంది. ఆటలో ఎనీ టైం ట్విస్ట్ ఇచ్చే పవర్ మా జడ్జెస్ దగ్గర ఉంది" అంటూ ప్రదీప్ చెప్పాడు.
ఇక శేఖర్ మాస్టర్ హెయిర్ స్టైల్ కూడా మార్చేశారు ఈ సీజన్ లో. ఒక పిలక వచ్చేసరికి "వావ్ పిలక మొత్తం అసలు మారిపోయారు సర్ మీరు" అంటూ ఫన్నీ డైలాగ్ వేసాడు. "ఈ కొత్త సంవత్సరం నుంచి కొత్త స్టెప్ వేయబోతున్నా" అని చెప్పారు శేఖర్ మాస్టర్. "మాస్టర్ ఇప్పటికే బోల్డన్ని స్టెప్పులేశారు" అంటూ స్టెప్పులేసి చూపించాడు ప్రదీప్. "ఆ స్టెప్పులు కాదబ్బా లైఫ్ లో ఇంకొక ముందుకు వేరే" అన్నాడు. "క్యూరియాసిటీ చాలా పెరిగిపోయింది. ఇప్పుడు చెప్పకపోతే అక్కడ కూర్చోలేము" అంటూ శ్రీదేవి అసలు విషయం చెప్పాలంటూ అడిగేసింది.
ఇక ఈ వీక్ ఎపిసోడ్ లో "బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్" అనే థీమ్ తో డాన్స్ చేయాలంటూ చెప్పాడు. ఆ తర్వాత అమరదీప్ - నైనికా వచ్చి డాన్స్ చేశారు. దానికి శ్రీదేవి గోల్డెన్ రోజ్ ఇచ్చింది. శేఖర్ మాస్టర్ లేచి కాలర్ ఎగరేసాడు.
![]() |
![]() |